
నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ లివర్ తినటానికి బాగా ఇష్టపడతారు. కర్రీ లేదంటే ఫ్రై రూపంలో తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. లివర్ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లివర్ తినటం వల్ల మనశరీరానికి ఐరన్, ఎ, బి9, బి12 విటమిన్లతో పాటు జింక్ వంటి విలువైన పోషకాలు సమృద్ధిగా అందుతాయట. అయితే చాలా మందిలో అనేక అనుమానాలు లేకపోలేదు.
అసలు చికెన్, మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి మంచిదా…కాదా అన్న సందేహం కలుగుతుంది. ఒక వేళ తింటే ఎంత మోతాదులో తీనాలి? ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా ఆందోళన చెందుతున్నారు. అయితేకొన్ని అధ్యయనాలు, నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం లివర్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అలాగే అతిగా తినటం వల్ల అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
చికెన్, మటన్ లివర్ తినటం వల్ల శరీరానికి విటమిన్ ఎ పుష్కలంగా అందుతుంది. రోజులో 100 గ్రాముల లివర్ తింటే డైలీ లిమిట్కి 10 రెట్లు కన్నా ఎక్కువగా విటమిన్ ఎ శరీరానికి అందుతుంది. అలాగని ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. విటమిన్ ఎ అనేది కొవ్వులో కరిగే విటమిన్ ,కొన్నిసార్లు విటమిన్ ఎ టాక్సిసిటీగా మారతుుంది. అందువల్ల రోజుకి మూడు వేల మైక్రో గ్రామ్స్ కంటే ఎక్కువగా తీసుకునేవారిలో దీర్ఘకాలంలో అనేక రకాల ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్లు లివర్ ను అధికమోతాదులో అసలు తీసుకోరాదు. విటమిన్ ఎ ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డలో అనేక లోపాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలు లివర్ తినకపోవటం మంచిదని అంటున్నారు. అధికమోతాదులో లివర్ తీసుకున్నట్లయితే, శరీరంలో విటమిన్ ఎ లెవెల్స్ బాగా పెరిగి టాక్సిసిటీ పెరగటంవల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.